TDP Leader Devineni Uma On Krishna Basin Water: "రాష్ట్ర రైతుల హక్కులను తాకట్టు పెట్టారు.. రాయలసీమను ఎడారిలా మారుస్తున్నారు" - అపెక్స్​ కమిటీ కౌన్సిల్​ సమావేశంలో సీఎం జగన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 8, 2023, 8:29 PM IST

TDP Leader Devineni Uma On Krishna Basin Water: కృష్ణా జలాలపై రాష్ట్ర రైతాంగం హక్కులను తాకట్టు పెట్టి రాయలసీమను ఎడారి చేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జక్కంపూడి, షాబాద్ గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకుల దీక్షకు పూనుకోగా.. వారి దీక్షలను సందర్శించిన దేవినేని వారికి సంఘీభావం తెలిపారు. కృష్ణా డెల్టాను ముంచేసి నాగార్జున సాగర్‌ ఆయకట్టును వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు.

రైతుల జీవితాలతో ఆడుకునే అధికారం ముఖ్యమంత్రి జగన్‌కు లేదని దేవినేని మండిపడ్డారు. కృష్ణా జలాలపై రాష్ట్రంలోని రైతుల హక్కులను కాలరాసి.. కోట్లాదిమంది రైతుల జీవితాలతో ఆటలాడుకునే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్​ కమిటీ కౌన్సిల్​ సమావేశంలో సీఎం జగన్​ నోరు మెదపకపోవటం దారుణమని అన్నారు. కేంద్ర క్యాబినెట్ ​లో కృష్ణా జలాల వినియోగంలో ఏపీకి నష్టం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటే.. రాష్ట్ర జలశాఖ మంత్రి మతి భ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల నిర్ణయాలను ప్రజలు చూస్తున్నారని.. రాబోయే రోజుల్లో వైసీపీకి తగిన బుద్ది చెప్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.