TDP Jansena Leaders Fires On Kodali Nani గుడివాడలో కొడాలి నాని పనైపోయింది.. టీడీపీ-జనసేన నేతల ఫైర్ - గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 8:16 PM IST
TDP Jansena Leaders Fires On Kodali Nani: పనికిమాలిన వాగుడు వాగుతున్న మాజీమంత్రి వైసీపీ ఎమ్మెల్యె కొడాలి నాని పనైపోయిందని టీడీపీ నేతలు విమర్శించారు. గుడివాడ టీడీపీ నేతలు, జనసేన నేతలు నానిపై ఫైర్ అయ్యారు. భర్తకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు ప్రజల్లోకి వెళ్తున్న భువనేశ్వరిపై నిందలు వేస్తున్న కొడాలికి పుట్టగతులు ఉండవని.. టీడీపీ నేత వెనిగండ్ల రాము హెచ్చరించారు. జగన్ జైలులో ఉన్న సమయంలో విజయమ్మ కూడా ప్రజల్లోకి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 8వ తరగతి చదివిన నానికి హెరిటేజ్ లాంటి సంస్థ గురించి ఎలా తెలుస్తుందని అన్నారు. పిచ్చివాగుడు వాగుతున్న కొడాలికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని మండిపడ్డారు. గతంలో రాజకీయ పార్టీల మధ్య కేవలం ఆరోపణలు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అవినీతిపై ఆరోపణలు మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఆ అవినీతిలో అరెస్టైనా వారు నిర్దోషి అని తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింద్నారు.
వంగవీటీ రాధా పెళ్లిలో కొడాలి స్థాయి ఎంటో చూపించారని గుడివాడ జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ విమర్శించారు. కొడాలి ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.