పనులు పూర్తి కాకుండానే జగనన్న ఇళ్లు ప్రారంభోత్సవం - ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ - టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 7:56 PM IST

TDP In-Charge Fires On UshaSree Charan Defects In Jagananna Houses: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలో ఇళ్లు పూర్తికాకుండానే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రారంభించి ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలతో కలిసి జగనన్న కాలనీలో ఉమామహేశ్వర నాయుడు సెల్ఫీ ఛాలెంజ్​కు దిగారు. మూడు నెలల క్రితం ఈ కాలనీలో మూడు ఇళ్లను ముస్తాబు చేసి మంత్రి ప్రారంభించి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 

కేంద్ర సహాయంతో తమ ప్రభుత్వం గతంలో నాణ్యమైన ఇళ్లు నిర్మించిందన్నారు. ప్రస్తుతం నాసిరకం ఇళ్లు నిర్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇస్తామని ఉమామహేశ్వర్ నాయుడు తెలిపారు. జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం భూసేకరణ పేరుతో కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.