తమిళనాడులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు - Chandrababu Fire on ysrcp govt

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 1:06 PM IST

TDP Chandrababu Visit Perumbudur Ramanujar Temple: రాష్ట్రంలో ధర్మ పరిరక్షణే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. దగా పడ్డ ఏపీని తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు. పవిత్ర ఆలయాల సందర్శనలో భాగంగా తమిళనాడులోని పెరంబదూర్ రామానుజార్ ఆలయాన్ని చంద్రబాబు సందర్శించారు. ప్రత్యేక విమానంలో అక్కడకు చేరుకున్న చంద్రబాబుకు తమిళనాడులోని తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. 

CBN at Perumbudur Ramanujar Temple: ఏపీ పరిపాలనలో మార్పు కావాలని ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారన్న ఆయన.. వైసీపీ హయాంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు సమర్థ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు తన కోసం కాదని, 5 కోట్ల మంది ప్రజానీకం కోసమని చెప్పారు. తెలుగువారి బాగుకోసమే తాను కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 11వ శతాబ్దంలోనే వినూత్న ఆలోచనలకు రామానుజార్ దేవాలయం శ్రీకారం చుట్టిందన్నారు. రామానుజార్ ఆశయాలు నేటి తరానికి తెలిసేలా చిన్న జీయర్ స్వామి హైదరాబాద్​లో ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పటం శుభపరిణామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.