నష్టపోయిన రైతులను పట్టించుకోని ప్రభుత్వం - మండిపడ్డ టీడీపీ, జనసేన నేతలు - TDP JanaSena Leaders Visits chevitikal

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 3:16 PM IST

TDP-JanaSena Leaders Visits Michaung Cyclone Effect Area: ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం, జనసేన నేతలు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ఈరోజు తెలుగుదేశం, జనసేన నేతలు పరిశీలించారు. ఆత్కూరు, చెవిటికల్‌ ప్రాంతాల్లో విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పలువురు నేతలు పర్యటించారు. 

TDP, JanaSena Leaders Fired on YCP Govt in Kanchikacherla Mandal : క్షేత్ర పర్యటనకు వచ్చిన టీడీపీ, జనసేన నేతలు తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా ఈదురుగాళ్లు, వర్షాలకు నేల వాలడంతో ధాన్యం మొలకలు వస్తున్నాయని నేతల వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గి నాలుగు రోజులవుతున్నా ఇప్పటికీ పంట నీళ్లలోనే తేలియాడుతుందన్నారు. పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వ అధికారులు ఎవరూ రాలేదని, నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులను తెలుగుదేశం, జనసేన నాయకులు ఓదార్చి, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.