Gangamma Jatara: కన్నుల పండువగా తిరుమల గంగమ్మ జాతర.. సారె సమర్పించిన ఎమ్మెల్యే - Tirupati MLA Bhumana Karunakara Reddy
🎬 Watch Now: Feature Video
Tirupati Gangamma Jatara: కలియుగ దైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడు కొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తారు. మంగళవారం విశ్వరూప స్తూపానికి అభిషేకాలు నిర్వహించి.. వడిబాలు కట్టడంతో.. జాతరకు అంకురార్పణ జరిగింది. అవిలాల నుంచి పసుపు కుంకుమలతో సారె తీసుకొచ్చి.. చాటింపు వేయడంతో.. జాతర ప్రారంభమైంది.
జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారె సమర్పించారు. స్థానిక పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి సమర్పించే సారెను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఊరేగింపులో అమ్మవార్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబద్ధంగా చిందేస్తూ పులకించిపోయారు. నవదుర్గలు, కాంతారా, తప్పేటగుళ్ళు, డప్పలు, తీన్మార్, కీలుగుర్రాలు, పగటివేషగాళ్లు, బోనాల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.