Super Heroes Robotic Exhibition: విజయవాడలో సందడి చేసిన సూపర్ హీరోస్.. మీరు చూశారా.! - సూపర్ హీరోస్ రోబోటిక్ ఎగ్జిబిషన్
🎬 Watch Now: Feature Video
Super Heroes Robotic Exhibition: సూపర్ హీరోస్గా పేరొందిన.. హీమ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్, ఆక్వామ్యాన్, కెప్టెన్ అమెరికా, హల్క్, డాక్టర్ స్ట్రేంజ్, థోర్, లోకి, థానోస్, స్పైడర్ మ్యాన్ వీరందరు ఒక్కచోటే ఉంటే చిన్నపిల్లల ఆనందం అంతా ఇంత కాదు. ఇప్పుడు వీళ్లు విజయవాడలో సందడి చేస్తున్నారు. అవునండి మీరు విన్నది నిజమే. ఇంతమంది సూపర్ హీరోస్ ఒక్కచోటే చేరి విజయవాడ నగరంలోని చిన్నారులను కనువిందు చేస్తున్నారు.
నగరంలోని బందర్ రోడ్డులో వజ్రా గ్రౌండ్స్‌లో ఆదివారం సాయంత్రం సూపర్ హీరోస్ రోబోటిక్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. వేసవి సెలవులు పురస్కరించుకొని వినూత్న రీతిలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి సూపర్ రోబోటిక్ ఎగ్జిబిషన్ ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో చిన్నారులు, నగరవాసులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఈ జెయింట్ సూపర్ రోబోస్ కదిలే బొమ్మలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపారు. ఈ సూపర్ హీరోస్ రోబోటిక్ ఎగ్జిబిషన్‌ను విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ప్రారంభించారు.