కన్నులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు - ఎమ్మిగనూరు లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 5, 2023, 2:11 PM IST

Subramanyaswamy Rathothsavam: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం సందర్బంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బుధవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. తమ కోరికలు ఫలించిన భక్తులు దవడ, వీపునకు ఇనుప శూలాలు గుచ్చుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీపునకు గుచ్చుకున్న ఇనుప శూలాలతో రథాన్ని లాగారు. ఈ దృశ్యాలు ఒళ్లు గగుర్పాటు కలిగించే విధంగా ఉన్నాయి. అయినా కూడా ప్రతి ఏటా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారిలో కొంతమంది సుబ్రహ్మణ్యస్వామికి తమకు తోచిన విధంగా  మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రథోత్సవం ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి పట్టణ ప్రధాన రహదారి గుండా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వరకు సాగింది. రథోత్సవం ముందు సత్య వేళ్లు కావాళ్లతో భక్తులు నృత్యం చేశారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.