బకాయిలు చెల్లించలేదని సెల్ టవర్ ఎక్కిన సబ్ కాంట్రాక్టర్ - nandhyala cell tower news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 7:39 PM IST
Sub Contractor Climbed the Cell Tower for Pending Bills : చేసిన పనులకు బకాయిలు చెల్లించలేదని ఓ సబ్ కాంట్రాక్టర్ మనస్థాపంతో ఏకంగా సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో చోటు చోసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి రోడ్డు పనులు చేస్తుంటారు. మరో కాంట్రాక్టర్ దగ్గర పనులు తీసుకుని డోన్ నియోజకవర్గంలో పలు చోట్ల 8 వంతెనలు నిర్మించారు. పనులు పూర్తి అయ్యి ఆరు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదని బాధితుడు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.
స్థానికంగా వంతెనలు నిర్మించేందుకు అప్పులు చేసి, పనులు పూర్తి చేశానని వాపోయాడు. బకాయిలు చెల్లించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నాడని పేర్కొన్నారు. అప్పుల పాలైన తాను ఏం చేయాలో తెలియక సెల్‌టవర్ ఎక్కినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేస్తానని పోలీసులు అధికారులు తెలిపినా వినలేదు. తనకు రావాల్సిన రూ.12 లక్షలు చెల్లిస్తేనే కిందకు దిగుతానని స్పష్టం చేశాడు.