'మెగా డీఎస్సీ పేరుతో మోసం' - విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన - job calendar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2024/640-480-20458907-thumbnail-16x9-student-unions-agitation-for-demanding-mega-dsc.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 4:53 PM IST
Student Unions Agitation for Mega DSC: ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి. స్థానిక అలంకార్ కూడలి ధర్నా చౌక్ వద్ద విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్యూ, టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ ప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగా డీఎస్సీని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పదవీ కాలం పూర్తి అవుతున్నా ఇప్పటి వరకూ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామన్న జగన్ మోహన్ రెడ్డి హామీ ఏమైందని యువజనులు నిలదీశారు. మెగా డీఎస్పీ పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మెగా మోసం చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ హామీని ప్రభుత్వం ఎందుకు నెరవేర్చడం లేదని విద్యార్థి సంఘాల ప్రతినిధులు నిలదీశారు.