Stuartpuram Villagers Protest: స్టూవర్టుపురం గ్రామస్థుల ఆందోళన.. ఎందుకంటే..! - protest on stuartpuram donga movie release
🎬 Watch Now: Feature Video

Stuartpuram Villagers Protest: తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రీకరించిన సినిమాలను విడుదల చేయొద్దంటూ స్టూవర్టుపురం గ్రామస్థులు డిమాండ్ చేశారు. పాత తరం నేరస్థుల జీవన విధానాన్ని భూతద్దంలో చూపిస్తూ తమ గ్రామాన్ని క్రైమ్ క్యాపిటల్‌గా అభివర్ణించే ప్రయత్నం చేయటం సమంజసం కాదంటూ నిరసనలు చేపట్టారు. తాజా పరిస్థితుల్లో కూడా పాత చరిత్రను పునరావృతం చేస్తూ చిత్రీకరిస్తూ 'టైగర్ నాగేశ్వరరావు', 'స్టూవర్టుపురం దొంగ' పేర్లతో సినిమాలు విడుదల కాబోతున్నాయని, మార్పు చెందిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఆ చిత్రాలు విడుదలైతే తమ గ్రామంపై ఆ ప్రభావం మరింతగా ఉంటుందని వాపోయారు. ఇలా తమ గ్రామాన్ని గజదొంగల ఊరుగా చిత్రీకరించే ఆలోచనలను దర్శక నిర్మాతలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో కొట్టుమిట్టాడుతున్న ఒకరిద్దరు మినహాయించి తమ గ్రామంలో ఆనాటి తరం గజదొంగలు లేనే లేరని ఆందోళనకారులు పేర్కొన్నారు. పాత కథల ఆధారంగా తాజాగా తీస్తున్న సినిమాలను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయకూడదంటూ నిరసనలు చేపట్టారు.