బాలికను వెంటాడిన వీధికుక్కలు - స్థానికుల చొరవతో సేఫ్ 'వీడియో వైరల్' - కుక్కల దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 5:10 PM IST
Street Dogs Attack Small Girl Was Injured: గుంటూరు నగరంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు వార్డులో ఆరేళ్ల బాలికపై వీధికుక్కలు దాడి చేశాయి. సంపత్ నగర్లో ఉన్న కుక్కలు బాలిక వెంటపడటంతో భయంతో పరుగులు తీసింది. కొంతదూరం వెళ్లాక బాలికను కుక్కలు కరిచాయి. బాలిక కేకలతో స్థానికులు సకాలంలో స్పందించి కుక్కల్ని అక్కడి నుంచి తరిమివేశారు. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. పది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ ఆరేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు.
ఆ ఘటన తర్వాత కూడా నగరపాలక సంస్థ అధికారులు సరిగా స్పందించలేదని స్థానికులు మండిపడ్డారు. అందువల్లే మళ్లీ వీధి కుక్కలు విజృంభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఈ వార్డుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మేయర్ సొంత వార్డులోనే ఇలాంటి పరిస్థితి ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరుస ఘటనల తర్వాత కూడా కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని మేయర్‌ను స్థానికులు కోరుతున్నారు.