Strange Rituals for Rain: వర్షాల కోసం వింత ఆచారం.. సమాధికి యువకుల అభిషేకం
🎬 Watch Now: Feature Video
Strange Rituals for Rain: వర్షాల కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. వరుణుడి కరుణ కోసం ఎన్నో సంవత్సరాలుగా చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఇందులో మనకు తెలిసినవి కొన్ని అయితే.. తెలియనివి చాలానే ఉంటాయి. ఆ రెండో కోవలోకి చెందినదే.. ఈ గ్రామస్థుల వింత ఆచారం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ.. వర్షం కోసం వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అంటే..?
వేసవి పోయింది.. రైతులు పంటలు వేసుకునే సమయం ఆసన్నమవుతోంది. కానీ వర్షాలు మాత్రం చాలా చోట్ల ఇంకా పలకరించలేదు. ఇదే విధంగా కర్నూలు జిల్లాలో ఆ గ్రామంలో కూడా జరిగింది. పత్తికొండ మండలం పందికోన గ్రామస్థులు వర్షాల కోసం పెళ్లికాని యువకులను సిద్ధం చేశారు. ఎందుకంటే.. పందికోన గ్రామంలోని కొండపై ఉన్న పెనుబండ బాబయ్య సమాధికి అయిదుగురు యువకులు 101 బిందెల చొప్పున నీటితో అభిషేకం చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్థుల నమ్మకం. అందులో భాగంగా పెళ్లికాని యువకులు.. 505 బిందెల నీటిని అభిషేకంగా సమర్పించారు. అనంతరం వీరిని మేళతాళాలతో ఊరేగించారు.