విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళన - ఈ నెల 27న మహా ప్రదర్శన - వేతనాలను సకాలంలో చెెల్లించాలని స్టీల్ ప్లాంట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 5:48 PM IST

Steel Plant Employees Protest : విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఉద్యోగులు శాంతియుతంగా నిరసన బాట పడ్డారు. విశాఖ స్టీల్​ ప్లాంట్ పొట్టి శ్రీరాముల విగ్రహం, అడ్మినిస్టేషన్​ బిల్డింగ్​ వరకు వేలాదిమంది ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం, యాజమాన్యం తమపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని వాపోయారు. 2020 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగులు ప్రమోషన్లు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా యువ ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టి వెళుతున్నారని పేర్కొన్నారు.

Steel Plant Employees Demand : వేతనాలు సకాలంలో చెెల్లించాలని, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్​, స్టీల్​ ప్లాంట్​కు సొంత గనులు సమకూర్చాలంటూ ఎగ్జిక్యూటివ్స్​ డిమాండ్​ చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తమ సమస్యలను తీసుకువస్తే ఏ మాత్రం పట్టించుకోలేదని ఉద్యోగులు వాపోయారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా స్టీల్​ ప్లాంట్​ ఉత్పత్తి తగ్గిపోయిందని వెల్లడించారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటించాలని విశాఖ జిల్లా కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఛైర్మన్​ జగ్గు నాయుడు కోరారు. ఈ నెల 27న కార్మికుల మహా ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.