కులవృత్తులు అంతరించాయి, కులాలు మాత్రమే ఉన్నాయి: మంత్రి వేణుగోపాల్​కృష్ణ

🎬 Watch Now: Feature Video

thumbnail

State Caste Enumeration Meeting : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సమగ్ర కులగణనపై సలహాలు, సూచనల కోసం రాజమహేంద్రవరంలోని  హోటల్ మంజీర సరోవర్లో  ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి వేణు గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి... ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే వాలంటీర్లతో కులగణనను నిర్వహించవద్దని వివిధ సంఘాల ప్రతినిధులు కోరారు. ఆర్థిక, సామాజిక అంశాలు సమగ్రంగా తేల్చాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి వేణు గోపాలకృష్ణ స్పందిస్తూ... పేదల జీవితానికి భద్రత కల్పించడమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

కులవృత్తులు అంతరించాయని, ఇప్పుడు కేవలం కులాలు మాత్రమే ఉన్నాయని మంత్రి వేణుగోపాల్​కృష్ణ వెల్లడించారు. వారికి ప్రత్యామ్నాయ జీవనాన్ని కల్పించడం కోసం ఎలాంటి అధ్యయనం జరగలేదని పేర్కొన్నారు. ఈ కులగణన ద్వారా.. ఇప్పుడు దానికి అంకురం పడిందని తెలియజేశారు. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించడానికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం ప్రభుత్వ పారదర్శకానికి నిదర్శమని పేర్కొన్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనం ఏమి లేదన్నారు. పేదల జీవితానికి భద్రత కల్పించడమే వైసీపీ లక్ష్యమని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.