వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్ 2023లో శ్రీకాకుళం క్రీడాకారుల హవా - బంగారు, కాంస్య పతకాలు కైవసం - ఏపీలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 1:19 PM IST
Srikakulam Athletes Won World Ability Sports Games 2023 : థాయ్‌లాండ్‌లో డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరుగుతున్న వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులు బంగారు, కాంస్య పతకాలు సాధించారు. జిల్లాలోని జి.సిగడాం మండలం సంతవురిటీ గ్రామానికి చెందిన పడాల రమాదేవి సింగిల్స్ విభాగంలో బంగారు పతకం గెలిచారు. అదేవిధంగా టెక్కలి మండలం శ్రీ రంగం ప్రాంతానికి చెందిన చాపర పూర్ణారావుకు సింగిల్స్, డబుల్స్ లో రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.
అయితే ప్రపంచ వ్యాప్తంగా పారా క్రీడల అభివృద్ధిలో వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్ గేమ్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శారీరక బలహీనతలతో ఉన్న క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహించి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ప్రొత్సహింస్తుంది. ఇందులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, పవర్ లిఫ్టింగ్, షూటింగ్, స్నూకర్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వీల్ చైర్ ఫెన్సింగ్ మెుదలైన ఆటలు నిర్వహిస్తారు.