రాత్రి 8 నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం..ఏర్పాట్లు చేసిన టీటీడీ
🎬 Watch Now: Feature Video
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధవారం ఉదయం శివ ధనుర్భంగాలంకారంలో రాముల వారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటల నుండి స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది.
కల్యాణ వేదిక వద్ద రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణ వేదిక వద్దకు భక్తులు పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. అంచనాలకు మించి భక్తులు కోదండ రామ స్వామి కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు అన్న ప్రసాదంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు జాగ్రత్తలు వహిస్తున్నారు. భక్తులకు గ్యాలరీకి వెళ్లే ముందే ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు ఇచ్చేందుకు టీటీడీ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు స్వామి వారిన దర్శించుకున్నారు.