కన్నుల పండువగా శ్రీనివాసుని పుష్పయాగం.. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
🎬 Watch Now: Feature Video
VENKATESWARA SWAMY PUSHPAYAGAM: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలోని శ్రీనివాసక్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద పండితులు 18 రకాల పుష్పాలు, 108 రకాల పూల బుట్టలతో శ్రీనివాసుని పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా వెంకటేశ్వర స్వామి పుష్పయాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాసుని పుష్పయాగ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్త జనాలు తరలివచ్చారు. కాలినడకన పుష్పాల బుట్టలతో భక్తులు.. కోలాటాల ప్రదర్శనల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ప్రదక్షిణలు చేశారు. అనంతరం పుష్పాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం చూసేందుకు అచ్చంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిపించినట్లుగానే వేద పండితులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం నిర్వహించారు. ఎస్టీబీఎల్ కాలనీ మహిళలు, పిల్లల కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నదానం చేశారు.