యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ - ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన టీడీపీ - Yuvagalam Vijayothsava jaithrayatra sabha latest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 12:16 PM IST
Special Trains for Yuvagalam Vijayothsava Sabha: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్(Nara Lokesh) చేపట్టిన యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో పోలేపల్లిలో ఈనెల 20న జరగనుంది. ఈ సభకు తెలుగుదేశం పార్టీ 7 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈనెల 19 నుంచి చిత్తూరు, తిరుపతి, రైల్వేకోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు విజయనగరం బయలుదేరనున్నాయి.
Yuvagalam Program in Vijayanagaram: ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని ఇప్పటికే టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారులకు లేఖ రాశారు. యువగళం జైత్రయాత్ర సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra babu), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pavan Kalyan), ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Baka Krishna) హాజరుకానున్నారు. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రానుండటం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఇరుపార్టీల శ్రేణులతో పాటు అభిమానులు భారీ ఎత్తున సభకు తరలివస్తారని అంచనాలు ఉన్నాయి.