Son Killed Father in Prakasam District: పెళ్లి చేయలేదని.. తండ్రిని చంపిన కుమారుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం - Son Kills Father in rayavaram prakasm dist

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 11:54 AM IST

Son Killed Father in Prakasam District: తనకు పెళ్లి చేయలేదనే అక్కసుతో కన్నతండ్రిని కుమారుడే హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరంలోని  కనకదుర్గమ్మ కాలనీలో బాలభద్రాచారి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడికి గురునారాయణ అనే కుమారుడు ఉన్నాడు. తనకు వివాహం కాలేదని మనస్థాపానికి గురైన గురునారాయణ... శనివారం తెల్లవారుజామున తన తండ్రి బాలభద్రాచారిని ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు.

పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో తన తండ్రి పై దాడి చేశాడు. గొంతు కోసి బాలభద్రాచారిని హతమార్చాడు. అనంతరం గరునారాయణ కూడా తన గొంతును కోసుకున్నాడు. అతని స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని చికిత్స కోసం ఒంగోలులోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.