తండ్రి పాలిట కాలయముడైన కుమారుడు - మంచంపైనే చంపి డీజిల్ పోసి తగులబెట్టాడు - కృష్ణా జిల్లా నేర వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 1:01 PM IST
Son Killed Father For Property: కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడయ్యాడు. ఆస్తి కోసం అత్యంత కర్కశంగా తండ్రిని చంపి మంచంపైనే డీజిల్ పోసి తగులబెట్టిన ఘటన భవదేవరపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Burnt with Diesel on Bed: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భవదేవరపల్లిలో బండి హరి మోహన్‌రావు(50) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం మోహన్ రావు భార్య మృతి చెందింది. వీరి తనయుడు పవన్ కల్యాణ్ తాపీ పని చేస్తున్నాడు. తండ్రీకుమారుల మధ్య కొంతకాలంగా ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు ఇంట్లోనే తండ్రిని చంపి, మంచం మీదే నిప్పుపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు మంటను అదుపు చేసే సరికేే మోహన్‌రావు మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పవన్‌కు గతంలోనూ నేరచరిత్ర ఉందని, ఆస్తి కోసమే తండ్రిని పవన్ హత్య చేసినట్టు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.