Solar Panels Damaged: ఆగిన సౌర విద్యుత్.. ఈదురుగాలులతో ఫలకాలు ధ్వంసం
🎬 Watch Now: Feature Video
Solar Panels Damaged in Tirupati: తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కింద ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఈదురు గాలులకు విద్యుత్ ఫలకాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. తిరుపతికి తాగునీరు అందించేందుకు వీలుగా శ్రీకాళహస్తి మండలం రామాపురానికి సమీపంలో ఉన్న కైలాసగిరి జలాశయంలో నీరు ఆవిరి కాకుండా నియంత్రించడంతోపాటు విద్యుత్ ఆదా ప్రధాన లక్ష్యంగా తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నీటిపై తేలి ఆడే సోలార్ విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఇటీవల తరచూ ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ ఫలకాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఫలకాలు నీటిపై కొట్టుకుపోకుండా అన్ని వైపులా భారీ తాళ్లతో వాటిని కట్టారు. అయితే వాటి పర్యవేక్షణ గాలికి వదిలేశారు. దీనికి తోడు ఈదురు గాలులు తాకిడికి ప్రాజెక్టు ద్వారా పలకాలన్నీ జలాశయం గోడలకు ఢీ కొట్టి ధ్వంసమయ్యాయి. దీంతో ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన నిలుపుదల చేశారు. ఈ వాటర్ ప్లోటింగ్ సోలార్ కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.