Shame on Dalit Minister Pinipe Viswaroop: సీఎం జగన్ సమక్షంలోనే దళిత మంత్రి పినిపేకు అవమానం.. వీడియో వైరల్ - Shame on Dalit Minister Pinipe Vishwarup
🎬 Watch Now: Feature Video
Shame on Dalit Minister Pinipe Viswaroop: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలోనే దళిత మంత్రి పినిపే విశ్వరూప్‌కి ఘోర అవమానం జరిగింది. కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు సొమ్ము ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Dalit groups fire on YSRCP government.. అయితే, కార్యక్రమంలో కొంతమంది మహిళలు సీఎం జగన్‌తో ఫొటో తీసుకున్నారు. ఆ సమయంలో దళిత మంత్రి విశ్వరూప్‌కు కుర్చీ దొరకలేదు. దీంతో ఆయన మోకాలిపైనే కింద కూర్బోబోయారు. ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి వెంటనే అప్రమత్తమై.. ఓ మహిళను పక్కకు జరిపి ఆమె కుర్చీలో ఓ పక్కకు మంత్రిని కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు మంత్రికి కనీస గౌరవం ఇవ్వకున్నా.. ముఖ్యమంత్రి స్పందించలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దళితులు విమర్శలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళిత మంత్రికిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ సమక్షంలోనే ఓ దళిత మంత్రికి ఇంతటి అవమానం జరగడం చాలా బాధాకరమని దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు.