School Seized Due to Child's Death బండ పడి చిన్నారి మృతి ఘటనలో.. స్కూల్​ను సీజ్ చేసిన అధికారులు - child diedrock fell inschool at Anantapur district

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 5:15 PM IST

School Seized Due to Child's Death అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎల్​కేజీ విద్యార్థిని కీర్తన పుట్టినరోజునాడే తరగతి గదిలో బండ విరిగిపడి మృతిచెందిన ఘటనపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కీర్తనపై తరగతి గదిలో బండ విరిగిపడి మృతి చెందిన శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అలానే పాఠశాలలో చదువుతున్న 120 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలలో చదవడానికి అనుమతిస్తామని గుత్తి డీవైఈఓ శంకర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా పాఠశాలలోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 12 ప్రైవేట్ పాఠశాలలను గుర్తించామని.. వాటిని భద్రత ఉండే పాఠశాలలుగా మార్చడమా లేక వాటిని సీజ్ చేయడమా జరుగుతుందన్నారు. చిన్నారి మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులతో చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.