కేంద్రమంత్రికి నిరసన సెగ - క్షమాపణ చెప్పాలంటూ సర్పంచ్ల నినాదాలు - Protest against Union Minister in Kodumuru
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 6:48 PM IST
Sarpanchs Protest Against Union Minister Devsingh Chouhan: రాష్ట్రంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రికి సర్పంచ్ల నుంచి నిరసన ఎదురైంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కోడుమూరులో కేంద్ర మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ (Union Minister Devsingh Chouhan) వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా ఆయనకు నిరసన సెగ తగిలింది. స్థానిక సర్పంచ్ని వేదిక మీదకు పిలవకపోవడంచో సర్పంచ్లు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వారు అధికారులపై నిరసన వ్యక్తం (Sarpanchs Protest) చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న పంచాయతీల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్లకు అధికారాలు కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రోటోకాల్ పాటించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వాలని నాయకులు నిర్ణయించారు. కనీసం ప్రోటోకాల్ ప్రకారం సర్పంచిని వేదిక పైకి పిలువకపోగా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు, పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.