Bhavishyathu Ku Guarantee: 'మా తండ్రి మరణాన్ని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు' - palnadu district political news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 1, 2023, 2:30 PM IST

Bhavishyathu Ku Guarantee Bus Yatra : అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని వైఎస్సార్సీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని గురజాల నియోజకవర్గానికి చెందిన వెంకటేష్‌ ఆరోపించారు. గత నెల 28న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన భోజనాలకు వచ్చిన ఎక్కువ మంది ఒకేసారి తోసుకోవడంతో కోటేశ్వరరావు ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌ గిన్నెలో పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని పిడుగురాళ్లలోనీ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధితుడిని పరామర్శించి ఇరవై వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు జీజీహెచ్​కి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో పాటు ఇద్దరు సహయకులను తోడుగా పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటేశ్వరరావు శుక్రవారం ఉదయం మరణించారు. అయితే దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని మృతుని కుమారుడు వెంకటేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.