Robbery in Two Express Trains: రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దోపిడీ.. 30 తులాల బంగారం చోరీ
🎬 Watch Now: Feature Video
Robbery in Two Express Trains: నెల్లూరు జిల్లా ఉలవపాడు - తెట్టు మధ్య రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నైకు వెళ్లే హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్2, ఎస్4, ఎస్5, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లో దొంగలు పడ్డారని ప్రయాణికులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎస్1, ఎస్2, బోగీల్లో కూడా దోపిడీ జరిగింది. దోపిడీ అర్ధరాత్రి జరిగిందని ప్రయాణికులు కావలిలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు ట్రైన్లలో కలిపి ముగ్గురు మహిళల నుంచి బంగరు గొలుసులు లాక్కెళ్లారని ఫిర్యాదు చేశారు. ఆరుగురు దుండగులు రెండు రైళ్ళ సిగ్నల్ బ్రేక్ చేసి దోపిడీ చేశారని తెలిపారు. మొదటి రైల్లో రెండు బోగీల్లో కలిపి మొత్తం ఏడుగురు వద్ద సుమారు 30 తులాల బంగారం చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. రెండో రైల్ సిగ్నల్ ట్రాప్ చేసే క్రమంలో పోలీసులు గుర్తించారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిపై రాళ్ల దాడి చేసి పరారీ అయినట్లు తెలిసింది.