మరమ్మతుకు నోచుకోని రహదారి - ప్రమాదకరమని తెలిసినా కొనసాగుతున్న ప్రయాణం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 5:44 PM IST
Roads Damaged Due to Cyclone : మిగ్జాం తుపాను తాకిడికి తిరుపతి జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నా ఇంత వరకు వాటికి మరమ్మతు చేయలేదు. ఓజిలిలోని ఇరిగేషన్ శాఖ పరిధిలో వంద ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుకు భారీగా వరద వచ్చింది. దీంతో చెరువుకు సమీపంలో ఉన్న రోడ్డు కోతకు గురైంది. చెరువు సమీపంలో ఉన్న పొలాలన్నీ నీట మునిగాయి. అధికారులు రోడ్డు మరమ్మతు చేయనందు వల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Non Repair of the Road : ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు ప్రమాదకరంగానే రాకపోకలు సాగిస్తున్నాయి. తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్డును మరమ్మతు చేయాలని అధికారులను అడిగితే వారు ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు తెలియజేశారు. ఆర్టీసీ బస్సుల కోసం ఐదు కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వస్తోందని ఓజిలి గ్రామ ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతు చేయవలసిందిగా కోరుకుంటున్నారు.