నెత్తురోడిన చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి - ఇద్దరు దుర్మరణం, ఐదుగురికి తీవ్రగాయాలు - National Highway road accident latest news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 1:05 PM IST
Road Accident On Chennai Kolkata National Highway: కృష్ణా జిల్లా చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద విజయవాడ నుంచి అతివేగంగా వస్తున్న కారు అంబులెన్స్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
మరో ప్రమాదం: అదే జాతీయ రహదారిపై మరో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న కారు బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద డివైడర్‌ను దాటి దూసుకెళ్లటంతో ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కేరళకు చెందిన థామస్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు కార్లు సగానికి పైగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.