పల్నాడు జిల్లాలో కారు బీభత్సం - రెండు బైకులను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం - జిల్లాలో రోడ్డు ప్రమాదాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 3:27 PM IST
Road accident in Palnadu District : పల్నాడు జిల్లా చిలకలూరిపేట కొత్త మార్కెట్ యార్ట్ ఎదురుగా బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మార్కెట్ యార్డులో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వేర్వేరుగా బైక్‌లపై వెళ్తుండగా కారు వేగంగా ఢీ కొట్టింది. కారు గుంటూరు వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Two Persons Died in The Accident : ఈ ప్రమాదంలో నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన కంభంపాటి కోటేశ్వరరావు (55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పట్టణంలోని సెల్‌ఫోన్ దుకాణ యజమాని కిషోర్ (48) చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం వల్ల మెయిన్ బజార్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.