బెంజి సర్కిల్లో రేసింగ్! మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కార్లు - నలుగురికి తీవ్ర గాయాలు - NTR district news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 19, 2023, 1:21 PM IST
Road Accident at Benz Circle in Vijayawada : విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాలను.. వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. శనివారం అర్ధరాత్రి ఒంటి గంటకు రేసింగ్ తరహాలో ఆగంతకులు కార్లను వేగంగా నడిపారు. బెంజ్, ఫార్చునర్ కార్లు పోటాపోటీగా వెళ్తూ.. రెండు ద్విచక్ర వాహనాలను ఫార్చునర్ కారు ఢీకొంది. దాంతో బైక్‌లపై వెళ్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే ద్విచక్రవాహనాలను ఢీకొన్న కారులో నుంచి ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు దిగి వెనుక వచ్చిన కారు ఎక్కి గురునానక్ కాలనీ వైపు పరారయ్యారు. గురునానక్ కాలనీలో మాజీ డీజీపీ గౌతం సవాంగ్ నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా వచ్చిన ఆ కారుని అడ్డుకొని పటమట పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.