అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి! ఇసుకతో బొమ్మలు వేస్తావా ? కళకారుడికి పోలీసుల బెదిరింపులు - బాపట్ల తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 4:26 PM IST
Revant Reddy Sand sculpture In Bapatla District : బాపట్ల జిల్లా సూర్యలంక తీరం వద్ద సైకత శిల్పిని అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు జిల్లాకు చెందిన బాలాజీ వరప్రసాద్ అనే సైకత శిల్పి ఇసుకతో శిల్పం గీసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సగం పనులు పూర్తయ్యాక అడవి, గ్రామ పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. దీంతో బాలాజీ బాపట్ల ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లగా అక్కడి వారు తమకు సంబంధం లేదన్నారు.
Sand Sculptor Arrest In Bapatla For Making Revant Reddysculpture : పోలీసు స్టేషన్కు వెళ్లగా మీపై పాత కేసు ఉందని బాలాజీని బెదిరించారని బాధితుడు వాపోయాడు. దీంతో బాలాజీ నివ్వెరపోయాడు. గతంలో చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు టీడీపీ నాయకుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు సైకత శిల్పం రూపొందించాడు వరప్రసాద్. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారని వరప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ కేసులో నోటీసులు తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నట్లు సైకతశిల్పి బాలాజీ వాపోయారు. అసలు కేసు నమోదైన విషయమే తనకు తెలియదని, ఇప్పటి వరకు వందలాది సైకత శిల్పాలు గీసినా ఎక్కడా ఇలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని బాలాజీ అవేదన వెలిబుచ్చారు.