మందపాడులో వైభవంగా రథోత్సవం.. పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు - రథోత్సవం
🎬 Watch Now: Feature Video
Rathostavam : గత నెల మార్చి 29న దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పలు ప్రాంతాల్లో భక్తులు శోభాయాత్రలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతా రామాంజనేయు స్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అందంగా అమర్చారు. స్వామి వారి కల్యాణం జరిపారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో భాగంగానే రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పారవశ్యంలో మునిగిపోయారు. శుక్రవారం సాయంత్రం రథాన్ని ఊరేగించారు. రథానికి విద్యుత్ కాంతులు ఏర్పాటు చేశారు. పూలతో సుందరంగా అలంకరించారు. రథానికి నీళ్లు పోసి.. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.