Nandyal Municipal Council Meeting: నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస.. ఆ కారణంతోనే.. - నంద్యాల జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Nandyal Municipal Council Meeting: వైసీపీ కార్యాలయానికి ఎకరా ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వడంపై నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిని.. పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారు..? అని తెలుగుదేశం కౌన్సిలర్ మహబూబ్ వలి ప్రశ్నించారు. దీంతో అధికార, విపక్ష కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతర పత్రాన్ని అందజేశారు.
కాగా.. లీజు ప్రాతిపదికన ప్రభుత్వానికి చెందిన ఎకరా భూమిని నంద్యాలలో వైసీపీ కార్యాలయం కోసం కేటాయించే అంశాన్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. నంద్యాల కుందునది సమీపాన మూలసాగరం సర్వే నంబరు 504/2లో ఎకరా భూమిని కేటాయించే ప్రక్రియకు అధికార పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. దీంతో పైన తెలిపిన విధంగా.. పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన ఈ భూమిని పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని టీడీపీ కౌన్సిలర్ ప్రశ్నించారు.
TAGGED:
Nandyal district latest news