Meda VijayasekharReddy Meet CBN: చంద్రబాబు ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: మేడా విజయశేఖర్ రెడ్డి - Joining TDP
🎬 Watch Now: Feature Video
Vijayasekhar Reddy join TDP : రాజంపేట నియోజకవర్గానికి జరిగిన తీవ్ర అన్యాయంలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి పాత్ర ఉందని ఆయన సోదరుడు మేడా విజయశేఖర్ రెడ్డి విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి భయపడో.. వేరే కారణాల వల్లో ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారని ధ్వజమెత్తారు. రాజంపేటలో ఉన్న వైసీపీ నాయకులందరూ ఆ ప్రాంతం వెనకబడటానికి కారణమన్నారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న విజయశేఖర్ రెడ్డి.. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. రాజంపేటకు కొత్త నాయకత్వం కావాలని విజయశేఖర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. రాజంపేట టిక్కెట్ కావాలని గతంలోనే చంద్రబాబుని తాను కోరానని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టరుగా రాజంపేట ఉండాలని తాము గతంలోనే ఉద్యమించామని గుర్తు చేశారు. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసేవాళ్లకే తము మద్దతిస్తామని స్పష్టం చేశారు. తనకొచ్చిన సమాచారం మేరకు ఎమ్మెల్యే మేడాపై లోకేశ్ ఆరోపణలు చేసి ఉండొచ్చన్నారు.