Railway Employee Interview About Train Accident: సిగ్నలింగ్ వ్యవస్థలో నాణ్యమైన పరికరాలు అవసరం : ఓబీసీ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ - రైలు ప్రమాదంపై రైల్వే ఉద్యోగి ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-10-2023/640-480-19892836-thumbnail-16x9-railway-employee-interview-about-train-accident.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 11:28 AM IST
Railway Employee Interview About Train Accident: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన వెంటనే వాల్తేరు డివిజన్ యంత్రాంగం కొద్ది గంటల్లోనే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే సిబ్బందితో కలిసి స్థానిక ప్రజలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అసలు ప్రమాదానికి కారణాలు, సిగ్నలింగ్ వ్యవస్థ బలోపేతాలనికి అనుసరించాల్సిన విధానాలపై మరింత సమాచారాన్ని ఓబీసీ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
సిగ్నలింగ్ వ్యవస్థలో నాణ్యమైన పరికరాలు అవసరమని తెలిపారు. రైల్వే భద్రతలో సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. అదే విధంగా రైల్వే శాఖలో కొత్త నియామకాలు చేపట్టాలని.. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం పడుతోందని రాజశేఖర్ తెలిపారు. రైల్వే సిబ్బందికి భద్రతాపరమైన శిక్షణ అవసరమని చెప్పారు. ఉద్యోగులపై పని భారంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఓబీసీ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్‌తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.