thumbnail

Purandeshwari Visited the Victims of Liver Cirrhosis: మద్యం, ఇతర అక్రమాలపై త్వరలోనే కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు: పురందేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 8:18 PM IST

Purandeshwari Visited the Victims of Liver Cirrhosis: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం నాణ్యతను పరిశీలించాలని.. తాను కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. మద్యం నాణ్యంగా ఉండేలా, ప్రమాణాలు పాటించేలా చూస్తానన్నారు. ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యంతో పాటు ఇతర అక్రమాల మీద త్వరలోనే నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు.

Purandeshwari Comments: విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో లివర్ సిరోసిస్‌తో చికిత్స పొందుతున్న బాధితులను.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. పరామర్శలో భాగంగా ఆమె బాధితులతో మాట్లాడారు. చౌకమద్యం తాగి, ఈ ఏడాదిలోనే 4సార్లు ఆసుపత్రిలో చేరానని ఓ బాధితుడు తెలుపగా.. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎప్పుడు చౌక మద్యం తాగవద్దని ఆమె సూచించారు. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. '' ఒక్క కేజీహెచ్‌లో లివర్ సిరోసిస్‌తో సుమారు 52 మంది బాధితులు బాధపడుతున్నారు. జగన్ ప్రభుత్వం విక్రయిస్తున్న చౌక మద్యం తాగి, అస్వస్థతకు గురైనట్లు బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఏపీలో మద్యం నాణ్యతను పరిశీలించాలని కేంద్రానికి చెప్తాను. మద్యం నాణ్యంగా ఉండేలా, ప్రమాణాలు పాటించేలా చూస్తాను. మద్యం సహా ఇతర అక్రమాలు మీద నేరుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తాను. మద్యం అమ్మకాలపై ఒక కమిటీని రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరతాను.'' అని ఆమె అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.