బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: పురందేశ్వరి - BJP state president Purandeswari comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 9:30 PM IST

Purandeshwari on Ycp Government: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా, కల్తీ మద్యం, రోడ్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించి.. బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఇతరులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. ట్రాక్టర్లు, జేసీబీలతో నదుల్లో పెద్దఎత్తున ఇసుక మైనింగ్ జరుగుతోందని ఆమె ఆరోపించారు.

Purandeshwari Comments: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె కాణిపాక వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..''రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోంది. మద్యంపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు, భవనాల నిర్మాణాలు జరగటంలేదు. 35-40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు, ఆదాయం పెరిగిందని చెప్తున్నారు.. మరీ రేషన్ కార్డుల పరిస్థితేంటి..?. ఈ ప్రశ్నలన్నింటీకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి.'' అని పురందేశ్వరి డిమాండ్ చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.