Public Data to IPAC: 'ఐప్యాక్ చేతిలో రాష్ట్ర ప్రజల డేటా.. ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ కుట్ర' - నీలాయపాలెం విజయ్ కుమార్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-07-2023/640-480-19022813-864-19022813-1689599720718.jpg)
TDP Leaders Anam and Vijay Kumar on Fake Votes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి డేటా ఐప్యాక్ గుప్పిట్లో ఉందని.. ఇది దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు అని తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి వ్యక్తికి సంబంధించిన అన్ని రకాల వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించి ఐప్యాక్ చేతిలో పెట్టారని.. ఆ పార్టీ నేతలు ఆనం వెంకట రమణారెడ్డి, నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. ఓటర్ల సమాచారాన్ని ఐప్యాక్‌కు అప్పగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేస్తున్నారని వారు విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఇదే పద్ధతి అనుసరించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. భవిష్యత్తులోనూ ఇదే విధానం అనుసరించి ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు.