Protest Against MLA Burra Madhusudan: 'వైసీపీకి ఓట్లేశాం.. అవస్థలు పడుతున్నాం' గడప గడపలో గ్రామస్థుల వినూత్న నిరసన - వైసీపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
Protest Against MLA Burra Madhusudan: వైసీపీ ప్రజాప్రతినిధులు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా నిరసన సెగ తప్పడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా చెర్లోపల్లి మండలం మెట్లవారిపాలెంకి స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ (MLA Burra Madhusudan) వస్తున్నారనే సమాచారంతో గ్రామస్థులు వినూత్న నిరసన తెలిపారు. గ్రామానికి వచ్చే మార్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏం అభివృద్ధి చేశారని.. మా గ్రామానికి వస్తున్నారంటూ.. ప్లెక్సీ ద్వారా ప్రశ్నించారు. వైసీపీకి ఓట్లేశాం.. అవస్థలు పడుతున్నాం అంటూ పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పని చేయని వైసీపీ నాయకులు అంటూ ప్లెక్సీలపై రాశారు. వాటిపై గ్రామంలో ఉన్న సమస్యల ఫొటోలను కూడా ముద్రించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గ్రామ ప్రజలు... ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఓట్ల కోసమే గడప గడప కార్యక్రమం పెట్టుకుని వస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ తమ గ్రామానికి ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ ఒక్కసారైనా కన్నెత్తైనా చూడలేదని గ్రామస్థులు తెలిపారు. వైసీపీ నేతల మాయమాటలకు తమ గ్రామంలో ఉన్న ఓట్లన్నీ వైసీపీకి వేశామని తెలిపారు. గెలిచిన తరువాత ఎమ్మెల్యే కంటికి కనిపించకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TAGGED:
Protest Against MLA Burra