Protest Against Minister Appalaraju: 'గడప గడపకు మన ప్రభుత్వం'లో మంత్రికి నిరసన సెగ - YCP
🎬 Watch Now: Feature Video

Protest against Minister Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లాలోని బొందికారి గ్రామానికి మంత్రి వెళ్లగా... అక్కడి ప్రజలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మంత్రని నిలదీశారు. ఇక పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం చేపి పంచాయతీ బొందికారిలో.. మంత్రి అప్పలరాజుకు నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం బొందికారి గ్రామానికి మంత్రి అప్పలరాజు రాగా.. గ్రామానికి కనీసం మౌలిక సదుపాయాలు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని మంత్రిని నిలదీశారు. రోడ్లు, వంతెనలు శిథిలావస్థకు చేరాయని.. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించు కోలేదని గిరిజనులు మంత్రిని నిలదీశారు. గ్రామానికి ఎలాంటి పనులూ మంత్రి అప్పలరాజు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలకు అన్ని రకాలుగా అభివృద్ధి వైకాపా ప్రభుత్వంలోనే జరిగిందని చెప్తూ.. మంత్రి అప్పలరాజు అక్కడి నుంచి వెనుదిరిగారు.