Tomato record prices: టమాటా కిలో రూ.50కే!.. బారులు తీరిన ప్రజలు.. - కడపలో టమోటా కొనుగోలుకు బారులు తీరిన స్థానికులు
🎬 Watch Now: Feature Video
Tomato record prices: రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి టమాటా ధరలు మోతమోగిస్తున్నాయి. వర్షాలకు తోడు వేడిగాలుల ప్రభావం వల్ల టమాటా పంట దిగిబడి తగ్గిపోయి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ రోజు మార్కెట్లో కిలో టమాటా ధర రూ.140 పలుకుతోంది. ఆకాశాన్నంటుతున్న ధరలతో టమాటాలను కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అయితే కడప రైతు బజార్లో మాత్రం ప్రభుత్వం సబ్సిడీతో కిలో టమాటాలను 50 రూపాయలకు అందిస్తోంది. దీంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు టమాటాల కోసం బారులు తీరారు. జిల్లాకు రెండు టన్నుల టమాటాలు ఇవ్వటంతో ఆయా ప్రాంతాల రైతు బజార్లలో సబ్సిడీతో విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డులు ఉన్నవారికి మాత్రమే సబ్సిడీపై టమాటాలను అందిస్తున్నారు. దీంతో ఇంట్లో పనులన్నింటినీ పక్కనపెట్టి ఆధార్ కార్డు పట్టుకుని మహిళలు, పిల్లలు, వృద్ధులు టమాటాల కోసం గంటల తరబడి లైన్లో నిల్చున్నారు.