ఆరోగ్యశ్రీ సేవలు బంద్! - రూ.1000 కోట్ల బకాయిలు, చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం - Dr YSR AAROGYASRI SCHEME
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 10:48 AM IST
Private Hospitals Stop Aarogyasri Services Due to Pending Bills in AP : డిసెంబరు 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో అధికారులు దిగి వచ్చారు. నేడు (గురువారం) ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. సుమారు రూ. 1000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో జరిగిన సమావేశంలో బకాయిలు మొత్తం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వంతో చర్చల తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఓ నిర్ణయానికి రానుంది.
గతంతో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో డిసెంబరు 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు లేఖను డిసెంబరు 22 తేదీన ప్రభుత్వానికి అందజేశామని అసోసియేషన్ తెలిపింది. 2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచలేదని తెలిపారు. పెంపు కోసం అసోసియేషన్ తరఫున పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదంటున్నారు. అంతేగాక తాజాగా కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా దానిని రూ.25 లక్షలకు పెంచారు. పెంపు నిర్ణయం ప్రైవేటు ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచిందని అంటున్నారు.