కోర్టులతో వైఎస్సార్ సీపీ సర్కారు ఆటలు! ఆరు నెలల్లో ప్రభుత్వం మారితే అధికారుల పరిస్థితి ఏంటి? - contempt of court case

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 9:27 PM IST

Prathidwani: న్యాయస్థానంతో ఆటలా..? ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కదా..? కోర్టు ధిక్కరణ కేసుల్లో (Contempt of Court Cases) ఎన్నో సందర్భాల్లో అధికారులకు న్యాయమూర్తులు చేసిన హెచ్చరికలివి. అయినా వారి తీరు మారితేగా! ఇప్పుడదే రాష్ట్రాన్ని ఆందోళనకర పరిస్థితుల్లో నిలిపింది. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో చట్టబద్ధ పాలనకు తూట్లు పొడిచారు అనడానికి దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ధిక్కరణ వ్యాజ్యాల్లో ఏపీ 2వ స్థానంలో ఉండడమే నిదర్శనంగా కనిపిస్తోంది. 

కోర్టులంటే జగన్ ప్రభుత్వానికి, అధికారులకు ఎందుకింత లెక్కలేనితనం? న్యాయస్థానాల ఆదేశాలు బేఖాతరు చేయటమంటే తీవ్రమైన విషయం. ఏపీలో అధికార యంత్రాంగం తీరు ఆందోళన కలిగించట్లేదా? ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నది ప్రభుత్వం ఏం చెప్పినా తలాడించటానికా? స్వతంత్రంగా పనిచేయటానికి వారికున్న ఇబ్బందేంటి? ప్రభుత్వ పెద్దలు చెప్పారని తప్పుడు కేసులు బనాయిస్తూ, ప్రతిపక్షాలను కేసుల్లో ఇరికిస్తుంటే రేపు ప్రభుత్వం మారాకా వారు ఎటువంటి పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? ప్రభుత్వం చేసే తప్పులకు ఈ అధికారులంతా రేపు కోర్టు ముందు నిలబడాల్సిందేనా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.