PRATHIDWANI దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి - రాహుల్
🎬 Watch Now: Feature Video
Prathidwani సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్‌లో మరో భారీ కుదుపు ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల అభిప్రాయాలకు విలువేలేదని, సోనియా పేరుకే అధ్యక్షురాలని, రిమోట్ కంట్రోల్లా రాహూల్ గాంధీనే అంతా నియంత్రిస్తున్నారని ఆజాద్ విమర్శించారు. ఇప్పటికే సీనియర్ నేతలు జీ-23 కూటమిగా ఏర్పడి పార్టీలో తమ గళాన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెస్‌లో సంస్కరణల కోసం తాము చేసిన సూచనలను అధి నాయకత్వం పలుచన చేసిందని వారు బహిరంగం గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిర్వీర్యం కాగా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల కన్నా వెనుకబడి ఉంది. ఈ వైఫల్యాలకు రాహూల్ వ్యవహారశైలే కారణమన్నది అసమ్మతి నేతల ఆరోపణ. మరోవైపు భారత్ జోడో పేరుతో 12 రాష్ట్రాల్లో పాదయాత్రకు రాహూల్ గాంధీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కాంగ్రెస్ బలం పెరుగుతోందా, తరిగిపోతోందా అనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST