PRATHIDWANI విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ఎప్పుడు - ap bifurcation act
🎬 Watch Now: Feature Video
Visakha Railway Zone: విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి లభించిన భరోసాల్లో ఒక ముఖ్యమైన అంశం రైల్వేజోన్ ఏర్పాటు.. ఆ దిశగా ప్రకటన చేశారు.. చట్టంలో పేర్కొన్నారు.. పేరు పెట్టారు.. రాష్ట్రం విడిపోయి ఎనిమిదిన్నరేళ్లు గడుస్తున్నా అసలు పురోగతే కనిపించడం లేదు. ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని విశాఖ వేదిక దక్షిణకోస్తా రైల్వేజోన్ ప్రారంభానికి గుమ్మడికాయ కొట్టే శుభముహూర్తం మాత్రం రావడం లేదు. విభజన హామీల అమలుపై మంగళవారం దిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా మరోసారి ఇదే తీవ్ర చర్చనీయాంశం అయింది. జోన్ ఎప్పటికని రేగిన దుమారంపై యధావిధిగా త్వరలోనే అంటూ స్పష్టత ప్రకటన చేసింది కేంద్రప్రభుత్వం. మరి ఆ త్వరలో ఎప్పటికి? ఇంతకాలంగా రైల్వేజోన్‌ను అడ్డుకుంటున్నదేంటి? అడ్డంకులు దాటి హామీల అమలు సాధించేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST