PRATHIDWANI ధాన్యం కొనుగోళ్ల తీరు మారేదెప్పుడు - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో ధాన్యం సేకరణ గందరగోళంగా మారింది. యాప్ సిద్ధం కాకపోవడంతో.. ఇప్పటికీ ఆఫ్‌లైన్‌లోనే కొనుగోళ్లు సాగుతున్నాయి. వాలంటీర్లే అంతా చూసుకుంటారని ప్రభుత్వం చెబుతున్నా.. అధికశాతం ఆర్బీకేల్లో అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో కొన్నిచోట్ల రైతులే నేరుగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీ నుంచి సేకరణ ప్రారంభించినట్లు పౌరసరఫరాల సంస్థ చెబుతున్నా... నిన్నటి వరకు 723 మంది రైతుల నుంచి 4 వేల 977 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ మొక్కుబడి తంతుపై రైతులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల తీరు మారేదెప్పుడు.. సేకరణ సాఫీగా సాగి రైతుల కష్టాలు తీరేదెన్నడు..? ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి ఇవే అంశాలపై.. నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST