PRATHIDWANI సైబర్ ఆపదలతో తలకిందులవుతున్న జీవితాలు - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
ఎక్కడో సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో కాదు. మన చుట్టూ, మనవాళ్లకు, అంతెందుకు మనకే ఎదురవుతున్న సైబర్ ఆపదలు జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. పరువు.., ప్రతిష్ఠల్నే కాదు, సమస్తం నెట్టింటి నడిబజారుకి ఈడ్చేస్తున్నాయి. సెల్‌ఫోన్‌లో సరదాగా దిగిన సెల్ఫీనే శాపం అవుతోంది. అయినవారితో ఏకాంత సందర్భాలు ఎవరెవరో పాడు కళ్లకు చిక్కుతున్నాయి. వాటి కారణంగా... సిగ్గుతో బిక్కచచ్చిపోతున్న వారు కొందరు, అవమానం భరించలేక ఊపిరి తీసుకుంటున్న వారు మరికొందరు.. ఈ-కీచకపర్వంలో. మరి మన మాన, మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవడం ఎలా. మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఎంతవరకు భద్రం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST