PRATHIDWANI శ్రమజీవుల గోడు వినే నాథుడెవరు - funds transfer
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: భవన నిర్మాణ కార్మికులు.. మరో వృత్తి తెలియని శ్రమజీవులు. నిర్మాణ పనులే జీవనాధారం వారికి. అటువంటి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీల సంక్షేమ నిధుల్ని కూడా దారి మళ్లిస్తోంది.. ప్రభుత్వం. అది చాలదన్నట్లు వారికంటూ ఉన్న ప్రత్యేక పథకాలు నిలుపుదల చేసి.. భవన నిర్మాణ కార్మికులనూ సాధారణ లబ్దిదారుల్లానే పరిగణిస్తోంది. పోనీలే అనుకున్నా.. నిబంధనల కొర్రీలతో ఆ నవరత్నాల ప్రయోజనాలు కూడా వారికి దరి చేరడం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే వెచ్చించాల్సిన వందల కోట్ల నిధుల్ని రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో డిపాజిట్లు చేయడం ఈ ప్రహనం మొత్తానికి హైలెట్. మరి ఆ శ్రమజీవుల గోడు వినే నాథుడెవ్వరు.. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.