Prathidwani: జీతాలు చెల్లించలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో చర్చనీయాంశంగా రాష్ట్ర అప్పులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 9:07 PM IST
Prathidwani: దేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు నిలుస్తున్నాయి. అప్పు తీసుకోనిదే రోజు గడవని దుస్థితిలో రాష్ట్రం ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతం రుణాల భారమే కాగా.. కొందరు ఐఏఎస్‌లకు సెప్టెంబర్ నెల జీతాలు సైతం అందలేదు (AP Government Not Paid Salaries to IAS Officers). నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేదు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వరు. రోడ్లు వేసేందుకు డబ్బులు ఉండవు. ప్రాజెక్టులు కట్టేందుకు నిధులు కేటాయించరు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందవు. డబ్బుల కోసం ప్రతి నెలా రిజర్వు బ్యాంకు దగ్గర అప్పు కోసం నిల్చోవాల్సిన పరిస్థితి. పథకాలు, డబ్బులు రావాల్సిన వారంతా జగనన్నకు చెబుదాం అంటూ ప్రతి సోమవారం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సంపద సృష్టించటం రాక, కేవలం అప్పులతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలోని ఆర్థిక ముఖచిత్రం. సంపద సృష్టి అంటే మద్యం ఆదాయం పెంచటమా..? మద్యం ఆదాయమే దిక్కు అవటంతో నిషేధం హామీకి జగన్ బైబై చెప్పారా..? రాష్ట్ర ఖజానాలోని డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది. ఎవరికి ఇస్తున్నారు. ఎలా ఖర్చు చేస్తున్నారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు, వ్యవహారాలకు కారణం ఎవరు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.